బైక్‌తో రైల్వే బ్రిడ్జిపై ప్రమాదకర రీల్స్ (వీడియో)

57చూసినవారు
ఓ యువకుడు రీల్స్ మోజులో పడి తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జిపై ఓ యువకుడు అమ్మాయిని ఎక్కించుకుని బైక్ డ్రైవ్ చేశాడు. వారు వెళుతున్న సమయంలో అటుగా రైలు వస్తే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఝార్ఖండ్‌లోని ఓ చిన్న గ్రామంలో ఈ ఘటన జరిగింది. యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్