ఎంపాక్స్ విజృంభణ‌.. హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO!

62చూసినవారు
ఎంపాక్స్ విజృంభణ‌.. హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO!
ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్‌ విస్తరిస్తున్నది. ఇందులో 96 శాతానికిపైగా కేసులను కేవలం కాంగోలో మాత్రమే గుర్తించారు. మరో వైపు కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్‌.. మరింత వ్యాప్తి చెందుతున్నది. దాంతో మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి.

సంబంధిత పోస్ట్