AP: సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈ నెల 5 నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. 5, 6, 7 తేదీల్లో ఆయన నియోజకవర్గం మొత్తం పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. పలు పథకాల అమలును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని, నియోజక వర్గాల ప్రజల్ని పరిస్థితి అడిగి తెలుసుకుంటారని వెల్లడించాయి.