గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లోని పలు విభాగాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ టౌన్ ప్లానింగ్, హెల్త్, వెటర్నరీ విభాగాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు సకాలంలో హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.