కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్ర రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌లపై వర్రా రవీంద్ర రెడ్డి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. మంగళవారం రాత్రి రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే 41C నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఈ కేసులో మరో సీఐ సస్పెండ్ అయ్యారు.