పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూరప్ దేశాలు

82చూసినవారు
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూరప్ దేశాలు
పాలస్తీనాలో శాంతి నెలకొనాలంటే ద్విదేశ పరిష్కారం అవసరమని ఐరోపా దేశాలు వాదిస్తున్నాయి. పాలస్తీనాను ప్రత్యేక రాజ్యంగా గుర్తిస్తున్నట్లు ఇటీవల నార్వే ప్రకటించింది. తాజాగా ఐర్లాండ్, స్పెయిన్ కూడా ప్రత్యేక పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయం హమాస్ చెరలోని బందీలను విడిపించడంపై ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల నుంచి తమ రాయబారులను ఉపసంహరించుకునేందుకు చర్యలు చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్