ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో ఏసీబీ అధికారులు తనను 82 ప్రశ్నలు అడిగారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటామని అధికారులకు చెప్పినట్లు వివరించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. 'నాపై సీఎం రేవంత్ బలవంతంగా కేసు పెట్టించాలనుకుంటున్నట్లు ఏసీబీ అధికారులకు కూడా అర్థమైంది. అవినీతి మేం చేయమని కుండబద్ధలు కొట్టి చెప్పా. ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటామని చెప్పా' అని అన్నారు.