సైఫ్‌ ‌అలీఖాన్‌పై దాడిలో ఆధారాలు గుర్తింపు: ఫడ్నవీస్

60చూసినవారు
సైఫ్‌ ‌అలీఖాన్‌పై దాడిలో ఆధారాలు గుర్తింపు: ఫడ్నవీస్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటనలో పోలీసులు కొన్ని ఆధారాలను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి చిత్రాలను స్పష్టంగా కనుగొన్నట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, అతి త్వరలోనే నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. కాగా బాలీవుడ్ స్టార్లపై వరుస దాడుల నేపథ్యంలో మహా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్