రెచ్చిపోయిన తిరుగుబాటుదాదులు.. పోలీస్ అవుట్‌పోస్టులపై దాడి

56చూసినవారు
రెచ్చిపోయిన తిరుగుబాటుదాదులు.. పోలీస్ అవుట్‌పోస్టులపై దాడి
మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. పోలీస్ అవుట్‌పోస్టులపై దాడి చేశారు. పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత బరాక్‌ నది ద్వారా సుమారు నాలుగు పడవల్లో తిరుగుబాటుదారులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఛోటోబెక్రా అవుట్‌పోస్ట్‌పై దాడి చేసి నిప్పుపెట్టారని, ఆ తర్వాత లాంటై ఖునౌ, మోధుపూర్‌లోని పోలీస్‌ అవుట్‌పోస్టులపై కూడా దాడి చేశారని వెల్లడించారు. ఇళ్లకు నిప్పుపెట్టిన మూకల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్