ప్రైవేటు రంగ వొడాఫోన్ ఐడియా ఎట్టకేలకు 5G బ్రాడ్‌బ్యాండ్‌లు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మార్చిలో 5G సేవల్ని తీసుకొస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా ప్రతినిధి తెలిపారు. మెరుగైన నెట్‌వర్క్ అనుభవంతో, తక్కువ ధరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. తొలుత 75 నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను పరిచయం చేయాలని వొడాఫోన్ ఐడియా చూస్తోంది. అధిక డేటా వినియోగించే పారిశ్రామిక కేంద్రాలపై దృష్టి సారించనుంది.