ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు ఆగస్టు 27 వరకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టయి తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.