ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త భార్య ఏక్తా అదృశ్యమైన 4 నెలలకు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో శవమై కనిపించింది. అయితే ఆమెను తానే హత్య చేసినట్లు విమల్ సోనీ అనే జిమ్ ట్రైనర్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఏక్తాకు సోనీతో వివాహేతర బంధం ఉండేదని చెప్పారు. అతను మరో మహిళతో పెళ్లికి సిద్ధం కావడంపై ఆమె అడ్డు చెప్పింది. దీంతో సోనీ ఈ హత్య చేశాడని వివరించారు. ఆమె శవాన్ని నిందితుడు జిల్లా మేజిస్ట్రేట్ బంగ్లా దగ్గర పాతిపెట్టడం గమనార్హం.