AP: అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా.. కొత్తగా రేషన్ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది.