ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు

54చూసినవారు
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు
ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్