అల్లు అర్జున్‌‌ను చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్.. మహిళ మృతి

65చూసినవారు
అల్లు అర్జున్‌‌ను చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్.. మహిళ మృతి
TG: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌కు హీరో అల్లు అర్జున్‌ వచ్చారు. దీంతో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు స్పృహతప్పి పడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రేవతి(35) మృతి చెందింది.

సంబంధిత పోస్ట్