తెలంగాణలో గత ప్రభుత్వం ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా, దీన్ని రూ.7,500కు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఎకరాకు రూ.ఆరువేల చొప్పున ఇచ్చి క్రమంగా రూ.7,500 చేయాలనే అభిప్రాయానికి వచ్చినా, దీనిపై కూడా చర్చించి 4న జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రైతు భరోసా అమలుపై కూడా భిన్నాభిప్రాయాలు ఉండటంతో దీనిపై కూడా చర్చించనున్నారు.