గడ్డి తగలబెట్టిన రైతులు.. నిప్పురవ్వలు ఎగిరిపడి గోడౌన్‌లో ఎగిసిపడిన మంటలు (వీడియో)

58చూసినవారు
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. బీబీనగర్ శివారులోని హిందుస్థాన్ సానిటరీ వేర్ కంపెనీ పక్కనున్న పంట పొలాల్లో శుక్రవారం సాయంత్రం రైతులు గడ్డి తగలబెడుతుండగా నిప్పురవ్వలు ఎగిరిపడి.. గోడౌన్స్‎లోని కాటన్ బాక్స్‎లకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్