అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కాగా ఒబామా దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. దంపతుల మధ్య మనస్పర్థలు కారణంగానే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కూడా మిచెల్ హాజరు కావడం లేదని సమాచారం. 2000 సంవత్సరంలోనే విడాకులు ఇవ్వాలనుకున్నట్లు ఒబామా తన బుక్‌లో కూడా రాసుకొచ్చారు. అయితే వీరికి సాషా, మలియా అనే కుమార్తెలు ఉన్నారు.