తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనం అవ్వగా.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. రంగంలో దిగిన రెస్క్యూ టీమ్ 22 మందిని కాపాడారు. వారిని కాపాడేందుకు 20కిపైగా అంబులెన్స్ రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటన సమయంలో ఆస్పత్రిలో వంద మంది పేషంట్లు ఉన్నట్లు సమాచారం.