TG: హైదరాబాద్ బేగంబజార్ పీఎస్ పరిధి తోపాఖానాలో దారుణం జరిగింది. యూపీకి చెందిన సిరాజ్ నగరానికి వలస వచ్చి తన ఇద్దరు కుమారులు భార్యతో నివాసం ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి సిరాజ్ భార్య, చిన్న కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన పెద్ద కుమారుడు పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.