మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఓ కారు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.