AP: శ్రీకాకుళం జిల్లా పెద్దకొజ్జిరియా వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో విశాఖలోని సీతమ్మధారకు చెందిన కదిరిశెట్టి సోమేశ్వరరావు (48), ఎం.లావణ్య (43), స్నేహా గుప్తా (18) మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఒడిశాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.