ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో బౌన్సర్ లను పెట్టుకుని తిరిగిన ఏకైక రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి అని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కాకముందు అయన బౌన్సర్ లను పెట్టుకుని తిరగలేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుదేలు అయిందని, సినీ ఇండస్ట్రీనీ ఇక్కడి నుండి పంపించే కుట్ర జరుగుతుందన్నారు.