జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) ఛైర్మన్‌గా ఇటీవల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ఎంపిక అయ్యారు. అయితే ఛైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని పాటించలేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పరస్పర సంప్రదింపులతో పాటు ఏకాభిప్రాయం లాంటి సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను ఎంపిక చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.