స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 23,750 మార్క్ పైన కదలాడుతోంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 78,584 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 23,765 వద్ద కొనసాగుతోంది.