ఫారం కోళ్లతో దేశీయ(నాటు) కోళ్లు, వలస పక్షులు కలవకుండా చూడాలి. పౌల్ట్రీఫాం ప్రాంగణంలో నీరు నిలువ ఉండకుండా చూడాలి. కోళ్లఫాంలలో తిరిగే వ్యక్తులు గ్లాజులు, ముఖానికి మాస్కులు తదితర దుస్తులు ధరించాలి. ఒకే వయసు ఉన్న పిల్లలను పెంచాలి. ఒక ఫాం నుంచి మరో కోళ్ల ఫాంకి వ్యక్తులు వెళ్లరాదు. క్రిమిసంహారక మందులు ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. నీటి, దాణా, సామాగ్రి మొదలైనవి శుభ్రంగా ఉంచాలి.