TG: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొడకండ్ల మండలం గిర్ని తండా వద్ద హైవేపై డీసీఎం-తుఫాన్ వాహనం ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగిరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు సూర్యాపేట జిల్లా ఈటూరు వాసులుగా గుర్తించారు.