దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం కాలుష్యం 408 (ఎక్యూఐ) పాయింట్లకు చేరుకున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. దీంతో, గ్రాఫ్-3 అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి వరుసగా కాలుష్యం పెరిగిపోయింది. దీంతో దట్టమైన పొగమంచు కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.