కారుకు ఆటో తగిలిందని ఆటో డ్రైవర్‌ను చితకబాదిన తండ్రీకొడుకులు (వీడియో)

2930చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ కారుకు ఆటో తగిలిందని ఆగ్రహించిన తండ్రీకొడుకులు ఆ ఆటో డ్రైవర్‌ను కనికరం లేకుండా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని రాణి తాల్ కూడలిలో కారు-ఆటో ఢీకొన్నాయి. వెంటనే కారులోని తండ్రీకొడుకులు బయటకు వచ్చి ఆటో డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. అతడు క్షమాపణలు చెబుతున్నా వినకుండా దాడి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్