బస్సులో రూ.50 టికెట్ కొనుగోలు చేయడానికి ఓ మహిళా పోలీస్ నిరాకరించింది. ఈ ఘటన హర్యానా వెళుతున్న రాజస్థాన్ బస్సులో చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన మహిళా కానిస్టేబుల్‌ను టికెట్ తీసుకోవాలని కోరడంతో ఆమె నిరాకరించింది. తన సొంత రాష్ట్రంలో ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే, బస్సు రాజస్థాన్‌కి చెందినది కావడంతో ఆమె టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పారు. చివరికి ఆమె టికెట్ తీసుకుంది.