TG: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో ఎస్ఆర్ఎస్పీ కాల్వలో పడిన కారు ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. సోమారపు ప్రవీణ్‌కుమార్(40), కృష్ణవేణి దంపతులకు కుమార్తె సాయిచైత్ర(5), కుమారుడు సాయివర్ధన్(3)తో కలిసి కారులో స్వగ్రామానికి వెళ్తూ ప్రమాదవశాత్తు ఎస్సీరెస్పీ కాలువ పడ్డారు. వెంటనే కృష్ణవేణి తన ఒడిలో ఉన్న బాబును ముందు డోర్ నుంచి బయటకు విసిరే ప్రయత్నం చేయగా నీటిలోనే పడిపోయాడు. ఆమె కాలువలోకి దూకారు. పక్కనే ఉన్న స్థానికులు ఆమెను కాపాడారు. కూతురు, కొడుకు, భర్తలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబం మొత్తాన్నీ కోల్పోయాక ఇక తాను ఎవరి కోసం బతకాలని కృష్ణవేణి గుండెలవిసేలా రోదించారు.