చంద్రబాబు, పవన్ నుంచి ప్రాణహాని: బోరుగడ్డ అనిల్ (వీడియో)

75చూసినవారు
AP: చంద్రబాబు, పవన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. 4 నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న మధ్యంతర బెయిల్‌పై తాను బయటకు వచ్చానన్నారు. తనకు అనంతపురం కోర్టులో బెయిల్ వస్తుందని తెలిసి కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం చేస్తోందన్నారు. తనపై జరుగుతున్న ప్రచారంపై స్పదిస్తూ వీడియోను విడుదల చేశారు. తన కుటుంబాన్ని చంపాలనుకుంటున్నారని అనిల్ లైవ్‌లో ఏడ్చేశారు.

సంబంధిత పోస్ట్