‘ఫెంగల్’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చి ప్రజలకు కష్టాలను మిగిల్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి ఓసారి బలహీనపడుతూ, కొన్ని గంటలకే బలపడుతూ పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి మీద మాత్రమే కాకుండా 1,500km దూరంలోని ఒడిశాపైనా చూపింది. ఐదు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
దీని తీవ్రత ఇవాళ సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతుందని IMD వెల్లడించింది.