BSF స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 275 కానిస్టేబుల్ గ్రూప్-సీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 30 డిసెంబర్. పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష ఫీజు రూ.147.20. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.