AP: వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. మంగళవారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు.. ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.