పెళ్ళైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య

75చూసినవారు
పెళ్ళైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య
TG: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెళ్ళైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఏఎంసీ కృష్ణ కాలనీకి చెందిన గుడిసెల రోహిణి (22)కి గత ఆగస్టులో వివాహం జరిగింది. కొద్ది రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో ఏఎంసీలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చిన రోహిణి సోమవారం ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు.

సంబంధిత పోస్ట్