శనగలో ఎరువుల యాజమాన్యం
By Potnuru 64చూసినవారునేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువును వాడాలి. ఎకరా శనగసాగుకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. నేలలో నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరం, పొటాష్ ఎరువులు వేయనక్కర్లేదు. ఎకరాకు 18కిలోల యూరియా, 125 సింగల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50కిలోల డీఏపీని వేసినట్లయితే పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం అందుతాయి.