ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా యువ దర్శకుడు మహేష్ బాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రామ్‌కు ఇది 22వ చిత్రం. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మూవీ మేకర్స్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.