ఘోర అగ్ని ప్రమాదం.. హోటల్ పూర్తిగా దగ్ధం

61చూసినవారు
ఘోర అగ్ని ప్రమాదం.. హోటల్ పూర్తిగా దగ్ధం
TG: మహబూబ్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ పక్కనే ఉన్న టీ హోటల్‌లో మంగళవారం అర్థరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టీ హోటల్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో డెబ్భై వేల ఆస్తి నష్టం మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్