రాష్ట్రంలోని మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. ఇప్పటివరకు 8,274 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 6,520 దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లోనే వచ్చాయి. మొత్తంగా చూసినా.. ఒక్కో షాపు కోసం కనీసం 3 దరఖాస్తులు కూడా రాలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో షాపు కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేవి.. ఇప్పుడేంటి ఇలా తక్కువ వస్తున్నాయని చర్చించుకుంటున్నారు.