శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దుల్లోని ఓ నియోజకవర్గంలో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే తండ్రి దుకాణాలన్నింటికీ దరఖాస్తులు వేస్తారని.. ఆయనకు వదిలేయాలని ఓ ప్రజాప్రతినిధి ఆదేశించినట్లు తెలిసింది. పల్నాడు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక్కో దుకాణానికి ఇంత చొప్పున తమకు సొమ్ము చెల్లించాలని కోరినట్లు సమాచారం. ఇలా సిక్కోలు నుంచి అనంతపురం వరకు వ్యాపారులకు బెదిరింపులు వచ్చాయని తెలిసింది.