పసుపును మనం నిత్యం తీసుకోవడం వలన ఊపిరితిత్తులను శుభ్రం అవడమే కాకుండా వాపులను తగ్గిస్తుంది. పసుపును రోజూ పాలలో కలిపి రాత్రి పూట సేవిస్తుండాలి. లేదా పసుపు వేసి మరిగించిన నీళ్లను కూడా తాగవచ్చు. పసుపులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి, ఇందులో ఉండే కర్‌క్యుమిన్ అనే సమ్మేళనం కాలుష్యం కారణంగా వ్యర్థాలతో నిండిన ఊపిరితిత్తులను బాగు చేస్తుంది. దీంతో ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.