TG: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురువారం హైదరాబాద్లో సందడి చేశారు. మధురానగర్లోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆమెకు తీర్ధప్రసాదాలు అందజేశారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన జాన్వీ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో జాన్వీతో సెల్ఫీలు తీసుకునేందుకు యువకులు, స్థానికులు ఎగబడ్డారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.