దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్లో దూసుకెళ్లిన సూచీలు ఇవాళ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధాన స్టాక్లలో మదుపర్లు విక్రయాలకు దిగడంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 375 పాయింట్లు కుంగి 80,003 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 24,353 వద్ద కొనసాగుతోంది.