బెంగళూరుకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నేహ బిస్వాల్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. తనను ఓ 10 ఏళ్ల బాలుడు వేధించాడని ఓ వీడియో ద్వారా ఆవేదనను తెలిపింది. BTM లేఅవుట్ లోని ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఎదురుగా ఓ బాలుడు వచ్చి.. తన చెస్ట్‌పై తాకాడని, కాసేపు తన చుట్టూ తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తించాడని కన్నీరు పెట్టుకుంది. అతడు కావాలని చేయలేదని సైకిల్ బ్యాలెన్స్ తప్పి పడినట్లు స్థానికులు చెప్పడం బాధ కలిగించిందన్నారు.