అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిచిగాన్‌లోని చిల్డ్రన్స్ వాటర్ పార్క్‌లో శనివారం ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది గాయపడ్డారు. అనంతరం నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడని ఓక్లాండ్ కౌంటీ షెరీఫ్ మైఖేల్ బకార్డ్ తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి వుంది.