బర్డ్‌ఫ్లూతో తొలి మరణం

70చూసినవారు
బర్డ్‌ఫ్లూతో తొలి మరణం
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. డయేరియా, వాంతులు లాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 24న మరణించారని పేర్కొంది. అతను జంతువుల వద్దకు వెళ్లినట్లు ఆధారాలు లేవని చెప్పింది.

సంబంధిత పోస్ట్