ఇంటర్ పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి ఫిట్స్

74చూసినవారు
ఇంటర్ పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి ఫిట్స్
మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌నగర్ మోడల్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్న ప్రోనిత అనే విద్యార్థినికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. గమనించిన ఎస్సై రాములు తన వాహనం‌లోనే మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రోనితను హాస్పిటల్‌లో చేర్పించిన ఎస్సై రాములుకు పరీక్షా కేంద్ర నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉంది.

సంబంధిత పోస్ట్