బాలికల విద్య కోసం బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శాంభవి చౌదరి తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. లోక్ జనశక్తి పార్టీ ఎంపీ శాంభవి చౌదరి తన లోక్‌సభ నియోజకవర్గం సమస్తిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తన మొత్తం వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికల కోసం ఈ డబ్బును వెచ్చించనున్నట్లు తెలిపారు.