సిద్దిపేటలో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. రైతు రుణమాఫీ అయ్యింది.. హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో BRS శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించడానికి వచ్చారు. రోడ్డుపైకి అర్ధరాత్రి భారీగా కాంగ్రెస్, BRS కార్యకర్తలు చేరుకున్నారు. వారి పోటాపోటీ నినాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పోలీసుస్టేషన్‌కు తరలించారు.